ముద్దన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…నందమూరి బ్రదర్స్..!!

Share Icons:

హైదరాబాద్, 7 ఫిబ్రవరి:

మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) మంగళవారం అర్థరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే..

ఆయన మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ సంతాపం తెలిపారు…

ముద్దుకృష్ణమ మృతిపై నందమూరి హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానన్నారు.

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కడవరకు కొనసాగారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పార్టీలో కొనసాగారని, ఆయన మృతి దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణ వార్త విన్న వెంటనే షాక్‌కు గురయ్యనని నందమూరి హరికృష్ణ తెలిపారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తననెంతో బాధించిందన్నారు.

ఆయన మృతి ప్రజలకు తీరని లోటని హరికృష్ణ పేర్కొన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మామాట: ముద్దు ఎన్టీయార్ ను వెన్నంటి  ఉన్నందుకే..

English Summary: Actor, TDP MLA Nandamuri Balakrishna and Harikrishna condolence to gaali muddu krishnamanaidu who passed away this morning at care hospital in Hyderabad.

Leave a Reply