ఏపీ బీజేపీకి షాక్…పార్టీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్యే

BJP MLA Akula satyanarayana fires on tdp leaders
Share Icons:

రాజమండ్రి, 7 జనవరి:

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారు.  

ఇక ఈరోజు ఢిల్లీ వెళ్ళిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇక విషయమై ఆకుల మాట్లాడుతూ…తాను ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదని, అయితే.. రాజీనామా చేయాలనే యోచనలో మాత్రం ఉన్నట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. అమిత్ షా తో చర్చించిన తర్వాతే.. తన రాజీనామా  చేయాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు

అయితే  బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై ఇప్పటికే ఆకుల పవన్‌తో సంప్రదింపులు జరిపారని, ఇక పార్టీలో చేరేందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఆకుల సత్యనారాయణ అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, ఇప్పటికే సత్యనారాయణ భార్య జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు.

మామాట: ఎన్నికల నాటికి ఎంతమంది వీడతారో…

Leave a Reply