ఆ ఆకతాయి తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేసి… తెరిచే కోడ్ మర్చిపోయాడు! ఆపైన…

Share Icons:

ఓ ఆకతాయి పిల్లాడు ఆడుకుంటూ తన తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్‌తో కట్‌ చేసి దానిని తొలగించారు. ఈ వింత ఘటన చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాన్‌లో చోటు చేసుకుంది. ఓ చిచ్చర పిడుగు సైకిల్‌ లాక్‌తో ఆడుకుంటూ దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు.

ఇంకేముంది పిల్లల సంగతి తెలిసిందే కదా. పిల్లలు చిచ్చర పిడుగులు అనేలా ఆ లాక్‌ని తన తల్లి మెడకి వేశాడు. పాపం జరగబోయేది తెలియక ఆ మహిళ కూడా మొదట్లో ఇదంతా ఫన్నీగానే తీసుకుంది.  అయితే, అయితే ఆట సమయంలో అన్‌ లాక్‌ కోడ్‌ను అతడు పలు మార్లు మార్చేయడంతో సరైన లాక్‌కోడ్‌ మర్చిపోయాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన ఆ తల్లి, లాక్‌ తెరిచే కాంబినేషన్‌ తెలియక కంగారు పడింది.

చేసేదేమి లేక ఆ తల్లి సహాయం కోసం పోలీస్ స్టేషన్‌ను వెళ్లింది, కానీ వారు ఆమెకు ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆ లాక్‌ ఓపన్‌ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది బృందాన్ని పిలిచారు. కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి అల్లరి పనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా తీసుకోగా కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply