తల్లితో కాపురం చేస్తూ, కూతురిపై కన్నేసి కాటేసిన కామాంధుడు!

Share Icons:

జోజిబాబు అనే ఓ కామాంధుడు కూతురు వరసైన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు, బాలి క తల్లి కథనం మేరకు.. గుంటూరు జిల్లా, పెదకాకాని(పొన్నూరు) ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన దానమ్మ తన కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. కుమార్తెను తన వద్దే ఉంచుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సుమారు పదేళ్ల క్రితం దానమ్మకు రాయపూడి జోజిబాబుతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.

అప్పటికే పెళ్లయి భార్యాపిల్లలను వదిలివేసిన జోజిబాబు దానమ్మతో సహజీవనం ప్రారంభించి ఎన్టీఆర్‌ కాలనీలోనే కాపురం పెట్టాడు. జోజిబాబు, దానమ్మకు మరో ఇద్దరు సంతానం కలిగారు. దానమ్మ మొదటి సంతానం కుమార్తె ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది. ఆ బాలికపై కన్నేసిన జోజిబాబు మాయమాటలుచెప్పి ఆదివారం ఎన్టీఆర్‌ కాలనీకి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన పాప జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో దానమ్మ తన కుమార్తెపై జోజిబాబు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆదివారం రాత్రి బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)   

Leave a Reply