ఎలక్షన్ కమిషనర్‌పై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు…నియంతలా…

Share Icons:

అమరావతి: ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ నేతలు తీర్వ వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా రమేశ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘స్థానిక ఎన్నికల వాయిదా ప్రకటన చేసిన రోజు బ్లాక్‌ డే. ఎస్‌ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. వాయిదా వేసే అధికారం ఆయనకు లేదు. ఏపీలో కరోనానే లేదు.. వైరస్‌ నిరోధానికి విద్యాశాఖ ద్వారా ప్రచారం చేస్తున్నాం. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని 2018లో రమేష్‌ ఎందుకు కోరలేదు?. కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు కావాలి. నిధులు రాకుండా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నియంతలా రమేష్ వ్యవహరిస్తున్నాడు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి ఎన్నికలు పెట్టాలి’ మంత్రి సురేష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేయడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం ఫైల్ చేసిన పిటిషన్‌ను లలిత్ ధర్మాసనం ధృవీకరించింది. మంగళవారం నాటి లిస్ట్‌లో నమోదు చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేసింది. ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై మంగళవారం సర్వోన్నత ధర్మాసనం విచారించనుంది.

ఏపీ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడకుంటా డిసిషన్ ఎలా తీసుకుంటారని గట్టిగా వాదించనుంది. ఈసీ తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించే అవకాశం ఉంది.

 

Leave a Reply