సోషల్ మీడియాలో పేర్ని పిట్టకథ హల్చల్…పవన్‌పై సెటైర్లు…

minister perni nani key comments on capital issue
Share Icons:

అమరావతి: ఏపీ మంత్రి వర్గంలో మంత్రి పేర్ని నానికి ప్రత్యేకమైన మాటతీరు ఉంది. ఆయన చిన్నపాటి విమర్శలు చేస్తూనే…ప్రతిపక్షాలకు చూరకాలు అంటిస్తారు. ఇటీవల కాలంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు లక్ష్యంగా పలుమార్లు సెటైర్లు వేశారు. తాజాగా కూడా ఆయన వీరిద్దరు లక్ష్యంగా ఓ పిట్టకథ చెప్పారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇంతకీ పేర్ని చెప్పిన ఆ పిట్ట కథ ఏంటంటే… “ఒక తండ్రి చనిపోతూ మంచంలో పడి ..ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు..నూటికి 95 మందితో చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను. నా చివరి కోరిక నన్ను మంచి అనిపించమని కొడుకును కోరాడంట. కొడుకుకు ఒక్కటే ఆలోచన వచ్చింది. తండ్రి చేసిన చెండాలమైన పనుల కంటే తాను మరి ఎక్కువైన చండాలమైన పనులు చేస్తే కానీ మా నాన్నకు మంచి పేరు రాదనుకొని అనుకున్నాడు. ఇక అక్కడి నుంచి  కొడుకు చేయని దుర్మార్గం లేదు. ప్రజలంతా అప్పటి నుంచి తండ్రే నయం..కొడుకు దుర్మార్గుడు అన్నారట. అప్పుడు తండ్రి ఆత్మ శాంతించిందట. చివరి రోజుల్లో నా కొడుకు నా కోరిక తీర్చాడని తృప్తి పొందాడట. “

ఇదే రకంగా పవన్‌ చంద్రబాబు వద్ద మాట తీసుకున్నారు. ఇప్పటి దాకా అవకాశ వాద రాజకీయానికి మారుపేరుగా చంద్రబాబు ఉండేవాడు. నిసిగ్గుగా ..ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించాలని చంద్రబాబు ఆలోచన చేశారు. చంద్రబాబుకు 70 పైచిలుకు వయసు ఉంది. తండ్రి కోరిక ఎలాగు కొడుకు లోకేష్‌ తీర్చలేరని పవన్‌ను కోరినట్లుగా ఉంది. నా కోరిక తీర్చు..నన్ను మంచొడు అనిపించు అని ఉంటాడు. అందుకనే ఆయన చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకునేలా అవకాశ వాద రాజకీయాలు పవన్‌ చేయడం ప్రారంభించారు.. అంటూ మంత్రి పేర్ని నాని వివరించారు.

 

Leave a Reply