జగన్ తలుచుకుంటే బాబుకు ప్రతిపక్ష హోదా ఉండదు….

minister peddireddy ramachandrareddy comments on capital
Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి  తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 3లక్షల కోట్లు  అప్పు చేశారు..60వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. తను నియమించుకున్న ఎస్‌ఈసీతో ఎన్నికలను వాయిదా వేయించారని మంత్రి అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ కూడా ఇవ్వని మహారాష్ట్రలో వాయిదా వేశారనడంలో అర్ధం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎక్కడా ఒక్క కేసు అయినా నమోదైందా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బ్లాక్‌క్యాట్‌ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు ఇంకా సీఎంనని భావిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్‌ తలుచుకుంటే చంద్రబాబుకు విపక్షనేత హోదా కూడా ఉండదన్నారు. చంద్రబాబు, ఎస్‌ఈసీ రమేష్‌ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు. రమేష్‌కు ఉద్యోగంలో కూడా చంద్రబాబు సాయం చేశారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించగానే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్నికల కమిషనర్‌పై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం ఉండి ఎందుకని, ఇష్టమొచ్చినట్లు వాయిదా ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఏకంగా ఎన్నికల కమిషనర్‌కు కులం పేరును ఆపాదించారు.

అలాగే ఎలక్షన్ కమిషనర్ పై గవర్నర్, సుప్రీం కోర్టు ఫిర్యాదు చేశారు. అయితే సుప్రీం కోర్టు కూడా ఎన్నికల సంఘం వాదననే సమర్ధించింది.

 

Leave a Reply