సంక్షేమశాఖ మంత్రిని తొలగించిన యూపీ సిఎం 

Minister of Welfare Removed by UP CM
Share Icons:

లక్నో, మే 20,

ఉత్తర్‌ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ తన కేబినెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి ఓపీ రాజ్‌బర్‌ను పదవి నుండి తొలగించారు. అయితే ఈ అంశంపై రాజ్‌బర్‌ను తక్షణమే తొలగించాలని గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు యోగి లేఖ రాశారు. సీఎం లేఖను పరిశీలించి రాజ్‌బర్‌ తొలగింపునకు రామ్‌ నాయక్‌ ఆమోద ముద్రవేశారు. అయితే కొద్దిరోజుల క్రితమే రాజ్‌బర్‌ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ దానికి ఆమోదం లభించలేదు.

తాజాగా మంత్రి పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు యోగి సిఫారసు చేయడంతో తాజాగా ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌బర్‌కు, బీజేపీకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.  ఈ సందర్భంగా మంత్రి ఓపీ రాజ్‌బర్‌ మాట్లాడుతూ..బీజేపీ ఎన్నికల గుర్తుపై పోటీచేయాలని కమలం పార్టీ నన్ను కోరింది.

నేను ఒక్క స్థానం నుంచే పోటీచేస్తాను..కానీ, అది నా సొంత పార్టీ గుర్తుపై బరిలో దిగుతానని వాళ్లకి చెప్పాను. ఐతే దీనికి బీజేపీ అంగీకరించలేదు. ఆ కారణంతోనే నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను. అని రాజ్‌బర్‌ వివరించారు.

మామాట- పోలింగ్ పూర్తయింది కదా.. ఇక చూస్కో

Leave a Reply