హోంశాఖకు   రోజా!

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 15,

ఏపీలో పొలింగ్ ముగిసింది. ఇప్పుడు పార్టీలన్నీ గెలుపుపై  లెక్క‌లు వేసుకుంటూ బిజీగా ఉన్నాయి. ఒక వైపు టీడీపీ 130 స్థానాల‌తో తామే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంటే.. మ‌రో వైపు వైసీపీ కూడా అదే ధీమా చూపిస్తోంది. అయితే గెలుపు ధీమా వైసీపీ నేత‌ల్లో కాస్త ఎక్కువగా క‌నిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాబోతుంద‌ని ప‌క్కాగా డిసైడ్ అయిపోయారు. దీంతో అప్పుడే తమ రాజకీయ భవిషత్తు బాగుండాలని పైరవీలు ప్రారంభించేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏ ప‌ద‌వి అయితే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుంటుంద‌నే దానికి సంబంధించి ఇప్ప‌టి నుంచే లెక్క‌లేసుకొని వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

జ‌గ‌న్ పార్టీలో కీల‌క నేత‌లు పార్టీ అధికారంలోకి వ‌చ్చేసింద‌ని ఫీలవుతున్నారు. దీంతో త‌మ‌కు ఏ మంత్రి ప‌ద‌వి కావాలో కూడా నిర్ణ‌యించుకొని జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.ఇందులో భాగంగా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పార్టీలో కీల‌క గొంతుగా మారిన రోజా ఈ అంశంలో కాస్త ముందున్నారు. ఫ‌లితాలు వెల్లువ‌డిత‌న త‌రువాత త‌మ పార్టీకి భారీ మెజార్టీ రావ‌డంతోపాటు తాను పోటీ చేస్తోన్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం లోకూడా భారీ మెజార్టీతో గెలుస్తాన‌న్న ధీమాను ఆమె వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాడితే కీల‌క మంత్రి ప‌ద‌వి పై ఆమె క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి హాయంలో స‌బితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి ప‌దవి ఇచ్చి పార్టీలో మ‌హిళ‌ల‌ను వైఎస్ ఎలా గౌర‌వించారో ఆయ‌న కుమారుడైన జ‌గ‌న్ కూడా త‌న‌కు హోంమంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడతారాని  రోజా ఆశపుతున్నారు. దీంతో పాటు నాలుగెళ్లు ప్ర‌తిప‌క్షంలో తాను పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌ానో జ‌గ‌న్ గుర్తిస్తార‌ని రోజా భావిస్తున్నట్టు తెలుస్తోంది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌న్నిహితుల‌తో కూడా రోజా ఇవే వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ త‌నకు హోం శాఖ కాక‌పోతే ఏం ఇస్తారు అని రోజా ధీమా వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్న మ‌రికొంత మంది నేత‌లు కూడా త‌మ‌కు ఏ మంత్రి ప‌ద‌వి కావాలో వాటి కోసం ఇప్ప‌టి నుంచి జ‌గ‌న్ వ‌ద్ద‌కు విజ్ఞ‌ప్తులు  తీసుకెళ్లుతున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. మొత్తానికి ఏ పార్టీ ఏ లెక్క‌లేసుకున్నా వారి లెక్క‌లు మాత్రం ఇంకా ఈవీఎంల్లోనే ఉన్నాయి. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

 

మామాట: అబ్దుల్ కలాం దారిలో కలలు కంటున్నారో.. 

Leave a Reply