ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు

Share Icons:

వేములవాడ, 24 అక్టోబర్:

అరవై ఏడేళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెసోళ్లకు యాభై ఏళ్లు, టీడీపీ వాళ్లకు పదిహేడేళ్లు అవకాశమిచ్చినా తెలంగాణకు చేయని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో తాము చేసి చూపించామని చెప్పారు.

అసలు ‘గమ్మత్తేమిటంటే.. ఆనాడు తెలంగాణకు అడ్డంపడ్డ గడ్డాలన్నీ ఒకటవుతున్నాయని, గడ్డం చంద్రబాబునాయుడు.. గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఇద్దరూ ఒకటవుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అడ్డంపడ్డారు….మళ్లీ అవే గడ్డాలు తెలంగాణకు గండంగా వస్తున్నాయని,  ఒక ముసలి నక్క కాంగ్రెస్.. గుంటనక్క చంద్రబాబు.. ఇద్దరూ ఒకటవుతున్నారని, ఇద్దరూ ఒక్కటై మన కొంపలు ముంచుతారని విమర్శించారు.

ఇక అలా తెలంగాణకి అడ్డుపడ్డ వాళ్ళు కేసీఆర్ ను ఓడించే వరకూ ఊరుకోరమని అంటున్నారని, అసలు‘కేసీఆర్‌ను ఎందుకు ఓడించాలి? అరవై ఏడేళ్లలో మీరు చేయని పనులు నాలుగేళ్లలో మేము చేసినందుకా?’ అని ప్రశ్నించారు.   

మామాట: మాటల తూటలతో వేడెక్కుతున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం

Leave a Reply