బందరులో 6,400 జీ+3 ఇళ్లకు శంఖుస్థాపన

Share Icons:

మచిలీపట్నం, 1 మార్చి:

ఎన్నో ఏళ్లుగా స్వంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న పేదవారి కోసం కృష్ణా జిల్లా బందరు (మచిలీపట్నం) మండలం గోసంఘంలో 6,400 జీ+3 ఇళ్లకు ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర శంఖుస్థాపన చేశారు. 360 కోట్లతో ఈ 6400 సామూహిక గృహనిర్మాణాలని చేపట్టారు.

ఉదయం మచిలీపట్నం బస్టాండ్ సెంటర్  వద్దగల ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి మంత్రి రవీంద్ర ర్యాలిగా బయలుదేరి వెళ్లారు.

minister kollu ravindra and mp narayana

అనంతరం గోసంఘంకు వెళ్ళి అక్కడ భూమి పూజ నిర్వహించారు. అలాగే ఈ 6,400 జీ+3 ఇళ్ళు నిర్మిస్తున్న ప్రాంతానికి ఎన్టీఆర్ నగర్ అని పేరు పెట్టారు.

ఇక ఈ శ౦ఖుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మ౦త్రులు పి. నారాయణ, దేవినేని ఉమా, బందరు యం.పి. కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సి బచ్చుల అర్జునుడు, చైర్మెన్ బాబా ప్రసాద్ పాల్గొన్నారు.

మామాట: నిర్మాణాలు ఎప్పటికీ పూర్తయ్యేనో…?

English summary:

Today, Minister Kollu Ravindra laid the foundation stone for 6,400 G3 + homes in the city of Machilipatnam for the poor who are looking for their own home for many years. These 6400 massive housing units were constructing with 360 crores.

Leave a Reply