బాబుకి, టీ కాంగ్రెస్ నేతలకి తేడా ఏం ఉంది?

Share Icons:

హైదరాబాద్, 31 జూలై:

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దిగువన ఉన్న ఏపీకి భవిష్యత్తులో గోదావరి జలాలు రావనే భయంతో ఈ ప్రాజెక్టుపై  చంద్రబాబునాయుడు కేంద్రానికి ఫిర్యాదులు చేశారని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు ఫిర్యాదులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మధ్య ఏం తేడా ఉందని ఆయన ప్రశ్నించారు.

అధికారం కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో అధికారానికి దూరమౌతామని ఉద్దేశ్యంతోనే వారు తప్పుడు కేసులను వేస్తున్నారని ఆయన చెప్పారు.

60 ఏళ్లలో జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన తరువాత జరిగిందని, మారుమూల గ్రామాలు సైతం పట్టణాలను తలదన్నేలా అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కార్చినా.. మోకాళ్లపై యాత్ర చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు.

మామాట: టార్గెట్ కాంగ్రెస్…!

Leave a Reply