మంత్రి గంటా వైసీపీలోకి వస్తున్నారా? నాకు తెలియదే..!

Share Icons:

విశాఖపట్నం, 20 జూన్:

ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ అయిన టీడీపీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం నాడు  విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి గంటా వైసీపీలోకి వస్తున్నారన్న విషయం తనకు తెలియదని అన్నారు.

అయితే పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామని, కానీ వైసీపీలో చేరేముందు వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు.

Botsa satyanarayana fires on tdp government

ఇక ఈ నెల 30వ తేదినా వంచనపై గర్జన పేరుతో అనంతపురంలో సభ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

అలాగే వచ్చే నెల 15వ తేదినా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో  ఏం జరిగిందనే విషయాలను బయటపెట్టాలని  బాబును బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

కాగా, ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొద్దీరోజులుగా వారి మధ్య దూరం ఇంకా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి గంటా డుమ్మా కొట్టారు. అనారోగ్య కారణంగా గంటా గైర్హాజరైనట్లు చెబుతున్నా, కారణం వేరే ఉండొచ్చని నేతలు చర్చించుకుంటున్నారు. అయితే పూర్తి విషయం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మామాట: మరి ఈ వార్తల్లో నిజమెంతో?

Leave a Reply