రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌…ఆ ఎంపీకి భూములు ఉన్నాయి…

botsa satyanarayana comments on ap capital
Share Icons:

అమరావతి:

ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని మార్పుపై ఆలోచిస్తున్నామని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడొకరికి రాజధానిలో భూములున్నాయని, ఆ వ్యక్తే అడిగితే ఆ వివరాలు బయటపెడతామని తెలిపారు.

అయితే విలేకరులు అడిగితే చూపెట్టేది లేదని, ప్రభుత్వం వద్ద అన్ని అంశాలు ఉంటేనే మాట్లాడతామని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, ఆ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని అన్నారు. ఇక రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు నిలకడ లేదని బొత్స మాట్లాడారు. రోజుకో మాట మాట్లాడే వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

రాజధాని టెండర్లలో, నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, చంద్రబాబు ఇంటిని లక్ష మందితో ముట్టడిస్తానని గతంలో పవన్‌ వ్యాఖ్యానించారని, బీజేపీ నేతలు కూడా రాజధానిలో అక్రమాలు జరిగినట్లు చెప్పారని, కానీ ఇప్పుడేమో పూర్తిగా రూటు మార్చారని అన్నారు. చంద్రబాబు గానీ, పవన్‌ కల్యాణ్‌ గానీ, బీజేపీ గానీ వారి సమస్యేంటో, వారికి ఎలాంటి సందిగ్ధత ఉందో మాకు స్పష్టంగా చెప్పగలిగితే పరిష్కారం చూపిస్తామని చెప్పారు.

 

Leave a Reply