లగడపాటి సర్వేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి

Share Icons:

విశాఖపట్నం, 21 మే:

లగడపాటి రాజగోపాల్ సర్వేపై టీడీపీ మంత్రి కూడా లగడపాటిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజల నాడి తెలిసిన వాడు ఎగ్జిట్ పోల్ చేయాలి తప్ప, అది తెలియని వాడు సర్వే చేస్తే ప్రయోజనం ఏముంటుందని అన్నారు.

అలాంటి వాళ్లందరూ ఎగ్జిట్ పోల్ చేయడం వల్ల ప్రమాదమని చెప్పారు.  ఇటీవల ఉదాహరణగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ని కారణంగా చెప్పారు. లగడపాటి చెప్పిన సర్వేని నమ్ముకుని పందేలు కాసిన వాళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని విమర్శించారు.

లగడపాటి మాట నమ్మేసి సర్వనాశనం అయిపోయామని ఇటీవలే హైదరాబాద్ లో పెళ్లికి వెళితే అక్కడికి వచ్చిన వాళ్లలో కొంతమంది తనకు చెప్పారని అన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో జరిగిన ఎన్నికలపై తన ఎగ్జిట్ పోల్ ఫలితాలని వెల్లడించిన విషయం తెల్సిందే, ఆయన సర్వేలో ఏపీ లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకుని మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు.

టీడీపీకి 90-110 సీట్లు వైసీపీకి 65-79 సీట్లు, జనసేనకి 1-5 సీట్లు రావోచ్చని తన అంచనాలని వెల్లడించారు. ఇక లగడపాటి సర్వేపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు, కేవలం బెట్టింగ్గులు కాసే వారికోసమే లగడపాటి సర్వే చేశారని ఎద్దేవా చేస్తున్నారు.

మామాట: మొత్తానికి లగడపాటి సర్వే నమ్ముకుంటే అంతే సంగతులు

Leave a Reply