జగనో, నేనో తేల్చుకుందాం… రమ్మనండి : మంత్రి ఆది(వీడియో)

Share Icons:
  • దందాలు.. చందాలు తప్ప ఆయనకేమి తెలియదు

  • స్క్రిప్టు లేకుండా మాట్లాడమనండి

  • వంద మంది వైసిపి నాయకులకు నేనొక్కడినే చాలు

  • ఆది నారాయణ రెడ్డి సవాల్

కడప, జనవరి 23 : జగన్మోహన్ రెడ్డికి దందాలు చందాలు తప్ప మరేమి తెలియదని, ఒక పేజీ కూడా స్క్రిప్టు లేకుండా మాట్లాడలేడని మంత్రి ఆదినారాయణ ఆరోపించారు.

ఒక వేదికపైకి వస్తే… తానో, జగనో తేలుస్తానని, అంతకూ కాకుంటే వంద మంది వైసిపి నాయకులకు సమాధానం చెబుతానని మంత్రి సవాల్ విసిరారు.

మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ఆయన లక్షకోట్లు సంపాదిస్తే ఆయన ఆడే అబద్దాలు లక్షా ఒకటి దాటిపోయాయని అన్నారు.

ఒక పేపరు స్క్రిప్టు లేకుండా మాట్లాడలేడని అతనూ రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రాజకీయాలలో కేసుల కోసం కేంద్రం ఎదుట సాగిలాపడి.. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలసి పనిచేస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నాడు.

తమ ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ అని ఇప్పటికి బీజేపీ నాయకులు వందమార్లు చెప్పారని, అయినా సరే జగన్ వారికే ఎందుకు ఓట్లేశాడని ప్రశ్నించారు. దీని వెనుక కేసులే పరమార్థం అన్నారు.

రెండో దఫా మహానేత ప్రభావమే మైనస్ 30 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

తాము రాజీనామా చేయలేదు సరే. తాము అనైతికులమే.. కానీ మమ్మల్ని ప్రశ్నించే నైతికత జగన్‌కు లేదని ఆరోపించారు. ఇంకా ఏమి మాట్లాడాడో మీరే చూడడండి.

మామాట : మంత్రి పదవితో కైపెక్కించిన బాబు… చిందులేస్తున్న ‘ఆది’

English Summary : AP Minister Adinarayana Reddy fired on YS Jagan Mohan Reddy, that Jagan doen’t know the politics. He telling lies in state.

 

Leave a Reply