ముందస్తు యుద్ధానికి సిద్ధమైన ఎం‌ఐ‌ఎం

Share Icons:

హైదరాబాద్, 11 సెప్టెంబర్:

కేసీఆర్ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికల బరిలోకి దిగడంతో అన్నీ పార్టీలు అలెర్ట్ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలు, టీజేఎస్ లు పొత్తులపై చర్చిస్తుండగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గట్టి పట్టు ఉన్న ఎం‌ఐ‌ఎం పార్టీ టీఆర్ఎస్ కి ధీటుగా 7 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులని ప్రకటించి ముందస్తు యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపింది.

పాత బస్తీలో తన పట్టును ఈ సారి కూడా నిలుపుకునే దిశగా పావులు కదుపుతూ… ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో చాంద్రాయణగుట్ట నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్ పురలో అహ్మద్ పాషా ఖాద్రీ పార్టీ టికెట్ పై పోటీ చేయనున్నారు.

వీరితో పాటు ముంతాజ్ అహ్మద్ ఖాన్(చార్మినార్), మహ్మద్ మౌజమ్ ఖాన్(బహదూర్ పుర), అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల(మలక్ పేట), జాఫర్ హుస్సేన్ మిర్జా(నాంపల్లి), కౌసర్ మొహీనుద్దీన్(కార్వాన్)లకు పార్టీ అధిష్ఠానం టికెట్లను కేటాయించింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. తాజాగా ఈ గెలుపు గుర్రాలకే పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టికెట్లను కట్టబెట్టారు.

మామాట: ఎంతైనా టీఆర్ఎస్‌కి ఫ్రెండ్లీ పార్టీ కదా….

Leave a Reply