ఆ మూడు నియోజకవర్గాలపై కన్నేసిన అసదుద్దీన్…

Share Icons:

హైదరాబాద్, 1 సెప్టెంబర్:

అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి హైదరాబాద్‌లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ గతంలో జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ స్థానాల్ని గెలుచుకుని పట్టు నిలుపుకుంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న స్థానాలతో పాటు మరో మూడో అసెంబ్లీ స్థానాలపై అసదుద్దీన్ కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తోన్నారు. ఇప్పటికే ఈ దిశగా అసదుద్దీన్ తన కార్యాచరణను కూడా మొదలు పెట్టారని సమాచారం.

ఒకవేళ టీఆర్ఎస్‌తో పార్టీతో పొత్తు ఉండే పక్షంలో… జీహెచ్ఎంసీ డివిజన్ల ఎన్నికల ఫలితాను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని అసదుద్దీన్ కోరుతున్నారట.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా, అంబర్ పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో మంచిగానే ఓట్లు సంపాదించారు.

మామాట: బాగానే ప్లాన్ చేసుకుంటున్నారుగా…

Leave a Reply