మైక్రోసాఫ్ట్‌ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు..ధర ఎంతంటే?

Share Icons:

ముంబై: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ సిరీస్‌లో నూతన ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. సర్ఫేస్‌ ప్రొ 7, సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 3, సర్ఫేస్‌ ప్రొ ఎక్స్‌ పేరిట ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం మాల్‌లలో విక్రయిస్తున్నారు. కాగా సర్ఫేస్‌ ప్రొ 7 ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.70,999గా ఉండగా, మిగిలిన రెండు ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలను మైక్రోసాఫ్ట్‌ ఇంకా వెల్లడించలేదు. ఇక సర్ఫేస్‌ ప్రొ 7 ల్యాప్‌టాప్‌లో 10వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3/ఐ5/ఐ7 ప్రాసెసర్‌, 16జీబీ వరకు ర్యామ్‌, 256 జీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, 12.3 ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, విండోస్‌10, 10.5 గంటల వరకు బ్యాటరీ బాకప్‌ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఏప్రిల్‌లో ఆపిల్ నుంచి కొత్త ఫోన్…

దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ త్వరలోనే ఓ నూతన బడ్జెట్‌ ఐఫోన్‌ను విడుదల చేస్తుందనే వార్తలు వస్తున్న విషయం విదితమే. కాగా ఆ ఫోన్‌ను ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట విడుదల చేస్తుందని తెలిసింది. ఆపిల్‌ తన నూతన ఐఫోన్‌ను మార్చి 31 లేదా ఏప్రిల్‌ 3వ తేదీన విడుదల చేస్తుందని తెలిసింది. ఇక కొత్త ఐఫోన్‌ ధర రూ.28వేల లోపే ఉండవచ్చని ప్రముఖ ఆపిల్‌ విశ్లేషకుడు మింగ్‌-చి కువో వెల్లడించారు.

కాగా ఇప్పటికే సదరు నూతన ఐఫోన్‌కు చెందిన ఇమేజ్‌లు, స్పెసిఫికేషన్లు నెట్‌లో లీకవ్వగా, ప్రస్తుతం ఆ ఫోన్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఓ వైపు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఆపిల్‌ ఐఫోన్ల ఉత్పత్తికి బ్రేక్‌ పడగా, కొత్త ఐఫోన్‌ విడుదల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాగా ఆ నూతన ఐఫోన్‌ 4.7, 5.4 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో రానుందని సమాచారం. అలాగే ఆపిల్‌ ఎ13 బయానిక్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లలో నూతన ఐఫోన్‌ విడుదలవుతుందని తెలిసింది.

 

Leave a Reply