బడ్జెట్ ధరలో విడుదలైన మైక్రోమ్యాక్స్ కొత్త ఆండ్రాయిడ్ టీవీ

micromax released new android tv's in india
Share Icons:

ముంబై:

 

ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీ సంస్థ మైక్రోమ్యాక్స్ భార‌త్‌లో నూత‌న ఆండ్రాయిడ్ టీవీ మోడ‌ల్స్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ టీవీలు 32 ఇంచుల డిస్‌ప్లే మొద‌లుకొని 43 ఇంచుల డిస్‌ప్లే వ‌ర‌కు ల‌భిస్తున్నాయి. 32 ఇంచుల మోడ‌ల్ టీవీ ధ‌ర రూ.13,999 ఉండ‌గా వీటిని రేప‌టి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు.

 

ఇక వీటిల్లో గూగుల్ ప్లే స్టోర్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచ‌ర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.

 

ఇక సౌండ్‌ప్రొ హెచ్‌ఎస్‌బీ3000 పేరిట సిస్కా కంపెనీ నూతన వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.3499 ధరకు ఈ హెడ్‌ఫోన్స్ వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారి 2-3 గంటల పాటు చార్జింగ్ పెడితే సుమారుగా 8-10 గంటల వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే 40 ఎంఎం డ్రైవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందున ఈ హెడ్‌ఫోన్స్ నాణ్యమైన శబ్దాన్ని అందిస్తాయి. వీటితో కేవలం మ్యూజిక్ వినడమే కాకుండా కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు.

Leave a Reply