అద్భుతమైన ఫీచర్లతో షియోమీ ఎంఐ సీసీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్

Mi Note 10 With 108-Megapixel Camera Set to Launch
Share Icons:

ముంబై: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు షియోమీ అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ సీసీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్ ని ఆ దేశ మార్కెట్లో విడుదల చేసింది. దీన్నే ఎం‌ఐ నోట్ 10 పేరిట ఇండియాలో త్వరలో విడుదల చేయనున్నారు. మిడ్‌నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, స్నో అరోరా కలర్ ఆప్షన్లలో షియోమీ ఎంఐ సీసీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,235గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.31,280 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.35,315గా ఉంది.

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 12, 5, 2, 20 మెగాపిక్సల్ కెపాసిటీలు కలిగిన మరో 4 కెమెరాలు.. మొత్తం కలిపి 5 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ వస్తుంది. దీంతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు.

షియోమీ ఎంఐ సీసీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

6.47 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 108, 12, 5, 2, 20 మెగాపిక్సల్ పెంటా బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 5260 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్.

టిక్‌టాక్ ఫోన్

ప్రముఖ సోషల్ యాప్ టిక్‌టాక్ నుంచి త్వరలో ఓ నూతన స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. టిక్‌టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ 3 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయనుంది.

టిక్‌టాక్ స్మార్టిజన్ జియాంగో ప్రొ 3 ఫీచర్లు..

6.39 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 13, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Leave a Reply