మనశ్శాంతి ఆరోగ్యానికి మంచిది

Share Icons:

మనశ్శాంతి ఆరోగ్యానికి మంచిది

ఏ విషయం పట్ల అయినా స్పష్టత ఉన్నప్పుడు ఒత్తిడి ఉండదు. అందుకే ముందు మన గమ్యం పట్ల స్పష్టత ఉండాలి. స్పష్టమైన లక్షాన్ని ఏర్పర్చుకుంటే దాన్ని సాధించే మార్గాలు బోలెడు కనిపిస్తాయి. ఎంత డబ్బు సంపాదించామన్న దానికన్నా ఎంత మంచి పేరు తెచ్చుకున్నామన్నదే ముఖ్యం. మంచితనంతో అందుకునే గౌరవాభి మానాలు డబ్బు కన్నా ఎక్కువ మనశ్శాంతినిస్తాయి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా అప్పుడప్పుడూ కొంత విరామం, విశ్రాంతి ఇవ్వడం మంచిది. అవిశ్రాంతంగా పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. సేద తీరడం వల్ల మరింత చురుగ్గా పనిచేయ గలుగుతాం.

 

యాంత్రికంగా బతకడం లో సంతృప్తి ఉండదు. కొన్నిరోజులకే విసుగువస్తుంది వస్తుంది. ప్రతీ పనిలో, ఆలోచనలో సృజనాత్మకత ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అని కాకుండా నలుగురితోనూ సత్సంబంధాలు పెంచుకోవాలి. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయడానికి ముందుండాలి. ఇతరుల కోసం పనిచేసి నప్పుడు కలిగే సంతృప్తి అందించే మనశ్శాంతి మాటల్లో చెప్పలేం.

 

అన్ని సందర్భాల్లో సానుకూలధోరణితో, చిరునవ్వుతో ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా అననుకూల అంశాలనుంచిఉఇ మనసును మళ్ళించాలి. అప్పుడు సంతోషం ఏర్పడుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి. కాస్తంత ఆధ్యాత్మిక చింతన అలవరచుకుంటే మనసుకెంతో ఊరటగా ఉంటుంది. ఉద్రిక్తత తగ్గుతుంది.

 

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply