ఆకర్షణీయమైన ఫీచర్లతో మెయ్‌జు కొత్త ఫోన్..

Share Icons:

ఢిల్లీ, 4 జూన్:

వినియోగదారులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లని అందిస్తున్న మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎక్స్‌ఎస్‌ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఇది భారత్ లో కూడా విడుదల కానుంది.

6 జీబీ ర్యామ్‌లను అమర్చినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ రూ.17,150 ప్రారంభ ధరకు వినియోగదారులకు ఈ నెల 10వ తేదీ నుంచి లభ్యం కానుంది. 

మెయ్‌జు 16ఎక్స్‌ఎస్ ఫీచర్లు…

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2232 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్.

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

మామాట: ఫీచర్లు అదిరిపోయాయి

Leave a Reply