‘ఎన్టీఆర్‌’లో ‘మెగాస్టార్’ పాత్రకి ఎవరంటే?

Megastar chiranjeevi character in ntr biopic
Share Icons:

హైదరాబాద్, 12 ఆగష్టు:

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించే నటీనటులను అధికారికంగా ప్రకటించకపోయినా.. రోజుకో కొత్త పాత్ర సోషల్ మీడియాలో పుట్టుకొస్తుంది.

అయితే ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రకు దగ్గుబాటి రానా, లక్ష్మీపార్వతి పాత్రకు ఆమని, శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రకు కీర్తిసురేష్‌, ఏఎన్నార్ పాత్రకు అక్కినేని హీరో సుమంత్‌లు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది ఏంటంటే…ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్‌ని హస్తగతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఈ బయోపిక్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అలాగే మెగాస్టార్ పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్‌ని నటింపజేసేందుకు క్రిష్ ప్రయత్నాలు మొదలెట్టాడని సమాచారం. దీనికి బాలకృష్ణ నుంచి కూడా అనుమతి వచ్చిందని చెబుతున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే వరుణ్ ‌తేజ్ ‘కంచె’ సినిమాలో నటించాడు.

ఆ పరిచయంతోనే వరుణ్‌ని క్రిష్ ఒప్పించాడని, అయితే దీనిపై పెదనాన్న చిరంజీవి నుంచి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే తాను ఈ పాత్రను చేస్తానని వరుణ్.. క్రిష్‌కి చెప్పాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

మామాట: చిరు పాత్ర కూడా ఉంటే బాగానే ఉంటుంది మరి….

Leave a Reply