ఇది రాజకీయ ఎత్తుగడే…

mayavathi suspend to his party leader jaiprakash
Share Icons:

ఢిల్లీ, 8 జనవరి:

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి స్వాగతించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిది కాదని అన్నారు. ఇక సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రభుత్వం ముందే తీసుకుంటే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. అలాగే వివిధ మైనారిటీ వర్గాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని పరిశీలించాలని మాయావతి సూచించారు. ఇక వెనుక బడిన వర్గాలు, పేద ప్రజల జనాభా పెరిగినందున… వారికి నూతన రిజర్వేషన్ విధానం అమల్లోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.

మామాట: మరి ఈ నిర్ణయం వలన బీజేపీకి ఏ మేర లబ్ది చేకూరుతుందో చూడాలి…

Leave a Reply