సోదరుడు బాటలోనే  రవిచంద్ర కూడా పయనించనున్నాడా?

Share Icons:

నెల్లూరు: వరుస షాకులతో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలతో సతమవుతున్న టీడీపీని సీనియర్ నేత బీద మస్తాన్ రావు పార్టీని వీడారు. నెల్లూరు జిల్లా కీలక నేత బీద మస్తాన్ రావు వైసిపి లో చేరడానికి రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. నేడు ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ నుండి మంచి గుర్తింపు ఉన్న నేత అయిన బీఎంఆర్ పార్టీని వీడటం టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 1,48,571 ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యారు. బీద మస్తాన్ రావు 2009లో కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి చెందారు. గత 2019 ఎన్నికల్లో కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా అధినేత చంద్రబాబు ఆదేశాలతో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయిష్టంగానే పోటీ చేసిన బీద మస్తాన్ రావు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.

అయితే, ఆ తర్వాత తన రాజకీయల్లో మార్పు వచ్చింది. ఆయనను మత్సకార సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన అన్నంత పని చేశారు. ఇదిలా ఉంటే ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రవిచంద్రకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన కూడాసోదరుడు బాటలోనే పయనించే అవకాశాలని తెలుగు తమ్ముళ్ళు కొట్టిపారేయడం లేదు. ప్రస్తుతానికి ఆయన జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి పార్టీ మరారనే అంటున్నారు. నిన్న ఆయన గుంటూరులో టీడీపీ జాతీయ కార్యలయం ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. మరి చూడాలి రవిచంద్ర కూడా సోదరుడు బాటలోనే నడుస్తారో లేక టీడీపీలోనే కొనసాగుతారో?

 

Leave a Reply