ఇంటి పైకప్పు ఎక్కిన మారుతి కారు…!!

Share Icons:

హిమాచల్‌ప్రదేశ్‌, 15 మార్చి:

రోడ్డుకు సుమారుగా 20 అడుగుల దూరంలో ఉన్న ఇంటి మీదకు మారుతి బాలెనో కారు దూసుకెళ్లింది. లక్కీగా ఆ ఇంటి రూఫ్ టాప్ రోడ్డుకు సమానంగా ఉండటంతో 100 అడుగుల లోయలో పడకుండా సేఫ్‌గా అక్కడ ల్యాండ్ అయ్యింది. డ్రైవర్ అదృష్టం బాగుండటంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సంభవించిన ఈ యాక్సెడెంట్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉన్న సర్కాఘాట్‌లో చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదిక ప్రకారం, బాలెనో కారు నియంత్రణ కోల్పోవడంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

car on house roof

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉన్న సర్కాఘాట్ లో తాజాగా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి బలెనో కారు ఒకటి ఆ రోడ్డుపై ఒక మూల మలుపు వద్ద రోడ్డుకు 20 అడుగుల దూరంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపైకి దూసుకెళ్లింది. అయితే కారు ఇంటి పైకప్పు మీదకు దూసుకెళ్లి అక్కడే ఆగింది. డ్రైవర్ చాకచక్యంతో సడెన్ బ్రేక్ వేశాడు. ఏదో వీడియో గేమ్‌లో జరిగినట్టుగా కార్ ఆ ఇంటి మీద ఆగింది. అక్కడి నుంచి కేవలం 4 అడుగులు ముందుకు వెళ్తే పెద్ద లోయలోకి కారు పడిపోయి ఉండేది.

car landed on house

కానీ అలా జరగలేదు. నిజంగా ఆ కార్‌లో ప్రయాణిస్తున్న వారి అదృష్టమనే చెప్పాలి. అయితే ఆ కారు ఇంటి పైకప్పు మీదకు ఎలా దూసుకెళ్లిందో తెలియదు కానీ.. ఈ వార్త అక్కడ సంచలనమే సృష్టించింది. కారు ఇంటి మీదకు చేరడంతో దాన్ని మళ్లీ రోడ్డు మీదకు తెచ్చేందుకు బాగా శ్రమించారు. ఇంటి పైకప్పు నుంచి రోడ్డు వరకు ఇనుప స్తంభాలను వేసి వాటిపై ఐరన్ ప్లేట్లను పెట్టి దాని మీద నుంచి కారును వెనక్కి తెచ్చారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయం కూడా కాలేదు. అది నిజంగా వారి అదృష్టమే. ఏది ఏమైనా ఈ యాక్సిడెంట్ వార్త మాత్రం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది..!

మామాట:  అదృష్టవంతులు…అంటే వీల్లేనేమో…

English Summary: Ever heard of a flying car? Well, if not, these pictures will force you to think twice. The photographs are of an accident in Sarkaghat in Himachal Pradesh, wherein a Baleno car somehow landed on a roof of house. The accident took place near Parsada Hawani on national highway

Leave a Reply