హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ ఉద్యమం

Maratha Kranti Morcha calls for Mumbai bandh]
Share Icons:

ముంబై, 25 జూలై:

మహారాష్ట్రలో మరాఠా సమాజ్‌ రిజర్వేషన్లు కోసం మరాఠా క్రాంతి మోర్చా చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. మరాఠా సమాజ్‌‌కు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ ఔరంగాబాద్ జిల్లాలో 27 ఏళ్ల మరాఠా యువకుడు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే పలు మరాఠా సంఘాలు ఈరోజు ఉదయం నుంచే రోడ్ల మీదకు వచ్చిన ఆందోళన చేశారు. షాపులు, విద్యాసంస్థలను మూయించివేశారు. అలాగే రోడ్లపైకి వచ్చిన బస్సులపై రాళ్లు రువ్వారు, అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా వారు దాడికి పాల్పడ్డారు.

ఇక బంద్‌తో దేశ వాణిజ్య రాజధాని ముంబై నిర్మానుష్యంగా మారింది. నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌తో బారులు తీరే రోడ్లు వెలవెలబోతున్నాయి. మరోవైపు సబర్బన్ రైళ్లను పోలీస్ పహారా మధ్య నడుపుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఛత్రపతి శివాజీ టెర్మినస్, కుర్లా, థానే, దాదర్ రైల్వే  స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మామాట: అదుపుతప్పిన ఆందోళన..

Leave a Reply