ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

Share Icons:

జయశంకర్ భూపాలపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చేసిన మావోయిస్టులు

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో హైఅలర్ట్

ఛత్తీస్‌గఢ్, 5 ఫిబ్రవరి:

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.

భకేలి – భాన్సీ ప్రాంతాల మధ్యలో ఉన్న రైలు పట్టాలను మావోయిస్టులు తొలగించారు. దీంతో 6 గూడ్స్ బోగీలు పట్టాలు తప్పాయి.

అలాగే కిరండోల్‌ పట్టణంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పనులు చేస్తున్న ఓ ప్రొక్లెయిన్‌తో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇవాళ్టి బంద్‌ను విజయవంతం చేయాలని పోస్టర్లు అంటించారు.

ఇక తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం ఎదిర వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు.

మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టుల ఉన్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి, వారి కదలికలపై నిఘా పెట్టారు.

మామాట: ఇలా చేస్తే ఒరిగిదేమిటో..?

English summary:

Maoists have committed a attack in Dantewada district of Chhattisgarh. Maoists removed rail tracks between Bhakeli and Bhansi areas. And in this 6 goods train trucks will be side from the track.

Leave a Reply