మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇకలేరు…

Share Icons:
  • మావోయిస్టు అగ్రనేత ఆర్కే  కన్నుమూత
  • దీర్ఘకాల వ్యాధితో ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ..
  • వైయస్ హయాంలో నక్సల్స్ జరిపిన చర్చల్లో కీలక పాత్ర
  • అనేక కేసులు .. తలపై రివార్డులు…

మావోయిస్టు అగ్రనేత ఆర్కే (రామకృష్ణ ) అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఛత్తీస్ ఘడ్ లో చనిపోయినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఆర్కే మావోయిస్టు పార్టీ లో అగ్రనేతగా ఉన్నారు. సిద్ధాంతాన్ని బోధించడంలో దిట్టగా ఆయనకు పేరుంది . దేశంలోని మావోయిస్టు పార్టీకి వేళ్ళమీద లెక్కబెట్టదగిన అగ్ర నాయకుల్లో ఆర్కే ను రెండు మూడవ స్థానంలో చెప్పుకుంటారు. వ్యూహాలు రచించడంలో , ఎత్తుగడల్లో , ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో  నక్సల్స్ కు , పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్కే. అనేక సార్లు ఆయన తప్పించుకున్నారు . సమావేశాలు , సిద్ధాంతాలు భోదించడంలో చాల నైపుణ్యం..

వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో నక్సల్స్ ను చర్చలకు ఆహ్వానించగా మావోయిస్టు పార్టీ నుంచి రామకృష నేతృత్వంలో బృందం అడవుల నుంచి బయటకు వచ్చింది. ప్రభుత్వం తో చర్చల సందర్భంగా ఎలా వచ్చారో అలాగనే వారు తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని షరతు విధంగా వారు వచ్చిన దారినే తిరిగి వెళ్ళేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చర్చల్లో ఆర్కే  కీలకంగా వ్యవహరించారు.

-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply