ఆ రెండు జిల్లా నేతలు చంద్రబాబుకు గట్టి షాక్ ఇస్తున్నారుగా…

chandrababu sensational decision tdp arrange the Rehabilitation for the activists
Share Icons:

అమరావతి: గత మే లో వెలువడిన ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి దారుణంగా ఉందనే చెప్పాలి. ఆ పార్టీకి వరుస షాకులు ఇస్తూ నాయకులు జంప్ లు కొట్టేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు గట్టి షాక్ ఇస్తూ…చాలామంది నేతలు బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా కూడా టీడీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి, సీఎం జగన్ సొంత గడ్డ కడపలో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి.

ఇటీవల తూర్పు గోదావరిలో కీలక నేతగా ఉన్న వరుపుల రాజా పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల18న ఆయన వైసీపీలో చేరనున్నారు. ఆయన వెళుతూ…వెళుతూ చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కాపు నేతలనీ పట్టించుకోలేదని, కావాలనే ఆయన సన్నిహితులని బీజేపీలోకి పంపించారని ఆరోపణలు చేశారు. అయితే ఈయనతో పాటు జిల్లాలో మరికొందరు ముఖ్య నేతలు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారని తెలుస్తోంది.

ఇక కడప జిల్లాలో పార్టీని నేతలు వరుసగా వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే రాజ్యసభ్య సభ్యుడు సీఎం రమేశ్ బీజేపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి… ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యి కడపలో కీలకంగా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి….బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆదితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకొనున్నారు.

అటు కడపలో కీలకంగా ఉన్న నేతలు రామసుబ్బారెడ్డి, వీర శివారెడ్డిలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. వీరిద్దరు వైసీపీలో చేరే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొందరు కూడా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొనున్నారు. అలాగే స్థానికంగా వైసీపీతో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా…ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బీజేపీలోకి వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కూడా బాబుకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఇటీవలే మొన్న ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలోకి వెళ్లారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్న్యాసి పాత్రుడు కూడా టీడీపీని వీడారు.

 

Leave a Reply