మంత్రాలయంలో ఆధిక్యం ఎవరిది?

Share Icons:

కర్నూలు, 5 ఏప్రిల్:

కర్నూలు జిల్లా మంత్రాలయం..నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వై.బాలనాగిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దళవాయి రామయ్యపై గెలిచారు.

అయితే ఆరునెలలకే టీడీపీని వీడి బాలనాగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ మరణం తర్వాత ఈయన వైసీపీలో చేరి 2014లో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై 7వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున బాలనాగిరెడ్డి పోటీ చేయనున్నారు. నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న తిక్కారెడ్డి టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు. దీంతో తిక్కారెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని తిక్కారెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే టీడీపీలో విభేదాలు వేధిస్తున్నాయి.

వైసీపీ అభ్యర్థిగా మరోసారి బాలనాగిరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయనపై తిక్కారెడ్డి విజయం సాధిస్తారా..? లేదా అనేదే ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. బాలనాగిరెడ్డికి కోసిగి, మంత్రాలయం మండలాల్లోని పది గ్రామాల్లో సాలీడ్‌ ఓటు బ్యాంక్‌ ఉంది. దీనికి గండి కొడితే తప్పా టీడీపీ గెలిచే అవకాశం లేదు.

మామాట: మరి చూద్దాం మంత్రాలయంలో ఈ సారి ఎవరిది ఆధిక్యం ఉంటుందో

Leave a Reply