ఆగష్టు 9న రానున్న మన్మథుడు-2…. అడివి శేష్ ‘ఎవరు’ ప్రీ లుక్

manmadhudu-2 release in august 9
Share Icons:

హైదరాబాద్:

 

టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం ‘మన్మథుడు 2’ ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, హీరోయిన్ గా రకుల్ నటించింది.

 

ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తను చేయనున్న ‘బంగార్రాజు’ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ఆయన మనసు మార్చుకున్నారన్నదే తాజా సమాచారం.

 

‘బిగ్ బాస్ 3’కి హోస్ట్ గా వ్యవహరించనున్న కారణంగా, నాగార్జున ఓ మూడు నెలల పాటు బిజీగా వుంటారు. అందువలన ఆ తరువాతనే ‘బంగార్రాజు’ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాను వచ్చే వేసవి సెలవులకి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నట్టుగా తెలుస్తోంది.

 

అడివి శేష్ హీరోగా ‘ఎవరు’ అనే సినిమా రూపొందుతోంది. రాంజీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 

ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా రెజీనా నటిస్తోంది. తెలుగు తెరపై రెజీనా జోరు తగ్గి కొంతకాలమవుతోంది. సరైన సినిమా పడితే తన జోరును మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఆమె వుంది.

 

Leave a Reply