ముప్పు తెస్తున్న చైనా మాంజాలు

Share Icons:
హైదరాబాద్, జనవరి 12,
సంక్రాంతి అంటే చాలు ఆకాశంలో ఎగిరే  పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా, గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన చైనా మాంజా రాజ్యమేలుతోంది.  రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లు తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం గత యేడాది నిషేధం విధించింది.
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, 10 వేల రైపాయలు జరిమానా విధిస్తారు. రెండేళ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  నగరంలోని పెద్దబజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్, శివాచి చౌరస్తా లతో పాటు పంగతులు అమ్మే వివిధ ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. రెండేళ్ల నుంచి ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు జంకుతున్నా రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు.
చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే చైనా మాంజా ఇతర రాష్ట్రాల్లో నుంచి నేరుగా నగరంలోకి ప్రవేశిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది. ఎవరైతే చైనా మాంజ అడుగుతారో వారిలో తమకు నమ్మకం వున్న వారికి మాత్రమే ఈ చైనా మాంజాను అత్యంత రహస్యంగా గోదాంల నుండి తెప్పించి మరీ అమ్ముతున్నారు. బేరం కుదరగానే రహస్యంగా పేపర్లో చుట్టి మంజా కస్టమర్లకు అమ్ముతారు.
ఇక సాధారణంగా వాటిలో ఉపయోగించే  కాటన్ కు బదులు.. గ్లాస్ కోటింగ్ తో ఉన్న నైలాన్ సింధటిక్ ను ఉపయోగించడం వల్ల అది నేరుగా వైరును పోలి ఉంటుంది. తెంపితే తెగడానికి వీలు లేనంత ప్రమాద కారణంగా దాన్ని తయారు చేస్తారు. సాధారణ మాంజాలు కైట్స్ ఎగరేసే సందర్భంలో తెగిపోయో అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇవి త్వరగా భూమిలో కలిసి పోతాయి. కాని చైనా మాంజాలు అలా కాదు. ఏళ్ళపాటు భూమిలొ ఉండటంతో పాటు పక్షులకు, మనుషులకు ప్రమాదకారణంగా మారుతున్నాయని అధికారులు చేప్తున్నారు.
చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
మామాట:  పతంగులతో ప్రమాదాలు జర జాగ్రత్త సుమా

Leave a Reply