మణిరత్నం దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్

Share Icons:

చెన్నై, 10 ఫిబ్రవరి:

మణిరత్నం అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది రైలు,వర్షం, ఓ రొమాంటిక్ ప్రేమకథ, ఓ సందేశం. అలాంటి ప్రత్యేకతలు ఒక్క మణిరత్నంకే ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తన సినిమాల్లో ఏదైనా ఫ్లాప్ అయితే వెంటనే మరో సినిమా చేసే అలవాటు లేదు. దాని కారణంగానే గతంలో చేసిన ‘చెలియా’ సినిమా పరాజయంపాలు కావడంతో, ఎప్పటిలానే కొంత సమయం తీసుకుని మణిరత్నం మరో కొత్త కథను సిద్ధం చేసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఒక భారీ మల్టీస్టారర్ చెయ్యనున్నారు. ఇక ఈ చిత్రంలో అన్ని పాత్రలు వైవిద్యభరితంగా, సమాన ప్రాధాన్యతతో ఉంటాయి.

ఈ సినిమా కోసం ఆయన శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జయసుధ, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితీరావు వంటి హేమాహేమీలను ఎంపిక చేసుకున్నారు.

తమిళంలో ఈ సినిమాకి ‘చెక్క చివంత వానమ్’అనే టైటిల్ ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంలో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

అందువలన ముందుగానే తెలుగు సినిమాకి ‘నవాబ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇటీవలే ఈ ప్రాజెక్టు నుంచి పహద్ ఫాజిల్ తప్పుకోగా, ఆ స్థానంలోకి మరో హీరోను ఎంపిక చేయనున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మామాట:  ఎంత కొత్తగా ఉంటుందో…చూద్దాం

English summary:

Maniratnam is going to do a huge multistar with Shimbu, Vijay Sethupathi, Arvind Swamy, Arun Vijay, Jayasudha, Jyothika, Aishwarya Rajesh and Aditi Rao.

In Tamil, the movie has been finalized with the title of ‘Chekka chivantha vaanam’. Recently, movie first look released and got good response. Telugu version of the film named as ‘Nawaab’.

Leave a Reply