టీడీపీ నేతలే శివాజితో ఇలా మాట్లాడిస్తున్నారు….

Share Icons:

అమరావతి, 10 సెప్టెంబర్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఆపరేషన్ గరుడ వ్యవహారం మళ్లీ మొదలైంది. సినీనటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ 4నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో నానా హంగామా చేసిన సనగతి తెలిసిందే. ఇక ఆ ఆపరేషన్ గరుడ వాస్తవమా…అవాస్తవమా అని తేల్చుకునేలోపే ప్రజలు దాన్ని మరచిపోయారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రసవత్తర రాజకీయాలు నడుస్తుంటే నటుడు శివాజీ మళ్లీ ఆపరేషన్ గరుడని తెరపైకి తీసుకొచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబుకి త్వరలోనే ఓ కేంద్ర సంస్థ నుంచి నోటీసులు వస్తాయని శివాజీ చెప్పడంతో….రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఎందుకు నోటీసులిస్తారు. నోటీసులివ్వాల్సిన అవసరం కేంద్రానికి ఏముంది..? అసలు శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవమెంత…ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరి నేతలు కలిసినా చర్చించుకునే మాటలు.

ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ గరుడపై సినీనటుడు శివాజీకి మాజీ మంత్రి మాణిక్యాలరావు కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్‌ గరుడ అనేది అవాస్తవమని, శివాజీతో టీడీపీ నేతలే ఇలా మాట్లాడిస్తున్నారంటూ ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కలిసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ గరుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలని ఒకవేళ అది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు.

మామాట: అసలు ఈ ఆపరేషన్ గరుడ ఎంతవరకు నిజమో?

Leave a Reply