అదరగొడుతున్న మణికర్ణిక తెలుగు ట్రైలర్…

Share Icons:

హైదరాబాద్, 5 జనవరి:

వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుదలకానుంది. ఇటీవలే హిందిలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇక తాజాగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుదల చేశారు. మూడు నిమిషాల 19 సెకన్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా కట్ చేశారు.

మణికర్ణిక కత్తిసాము చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి దూకి ఏనుగుపై కూర్చున్న సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్‌ల మ్యూజిక్, యుద్ధ సన్నివేశాల్లో సంచిత్, అనిక్త్ బల్హారా నేపథ్య సంగీతం ట్రైలర్ స్థాయిని పెంచింది. నిక్ పావెల్ యాక్షన్ ఎపిసోడ్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. 

మామాట: మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందిలే…

Leave a Reply