దారుణం: ప్రియుడిని కట్టేసి…ప్రియురాలిపై అత్యాచారం…

Share Icons:

బెంగళూరు, 28 నవంబర్:

ఏకాంతంగా గడపటానికి బీచ్‌కు వచ్చిన ప్రేమ జంటపై ఓ ఏడుగురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతని కళ్లేదుటే ప్రియురాలిపై ఆ దుర్మార్గులు అత్యాచారం చేశారు.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువకుడు అదే సంస్థలో పనిచేసే యువతి కొద్దీరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఏకాంతం కోసం ఈ నెల 18న మంగళూరులో ఉన్న బెంగ్రే బీచ్‌కు వెళ్లారు.

అయితే ఒంటరిగా ఉన్న వీరిని గమనించిన ఏడుగురు కామాంధులు ఈ జంటను వెంబడించారు. ఇక వీరిని పట్టుకుని బీచ్ సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువకుడిని చెట్టుకు కట్టేశారు. అతడి ఎదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతనం ఇద్దరిని అక్కడే వదిలేసి వెళ్లారు…ఇక ఆ షాక్ నుంచి తేరుకున్న యువతి తన ప్రియుడిని విడిపించి ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దక్షిణ కన్నడ జిల్లాలోని పాండేశ్వరలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని… మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ కామాంధులంతా కల్లడ్క ప్రాంతంలోని జాలర్లుగా గుర్తించారు.

మామాట: ఎన్ని చట్టాలు ఉన్న మనదేశంలో ఇలాంటి ఘటనలు ఆగడం లేదు…

Leave a Reply