మండపేటలో త్రిముఖ పోరు…

Share Icons:

కాకినాడ, 5 ఏప్రిల్:

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మూడోసారి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరావు విజయం సాధించి హ్యాట్రిక్‌ రికార్డు కోసం తహతహలాడుతున్నారు. ఇక వైసీపీ తరపున పిల్లిసుభాచంద్రబోస్‌, జనసేన తరపున వేగుళ్లలీలాకృష్ణలో బరిలో ఉన్నారు. అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఇక్కడ త్రిముఖపోరు జరగనుంది.

ప్రస్తుతం బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో టీడీపీ జనసేన అభ్యర్ధులు కమ్మసామాజికవర్గానికి చెందినవారు కావడంతో బీసీలకుచెందిన పిల్లిసుభాచంద్రబోస్‌ వైసీపీ తరపున బరిలో ఉన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమమే తన విజయానికి దోహదపడతాయని కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే వేగుళ్లజోగేశ్వరరావుకు అన్నివర్గాలతో సత్సంబధాలు కలిగిఉండటం ఆయనకు కలిసి వస్తోంది.

పల్లెలను కూడా పట్టణంతో సమానంగా తీర్చిదిద్ది రాష్ట్రస్థాయిలో మండపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు.

ఇక జనసేన అభ్యర్థి వేగుళ్లలీలాకృష్ణ కాపు సామాజికవర్గం, యువతపైనే ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి సమయం లేకపోవటం నూతనంగా వైసీపీనుంచి జనసేనలోకి చేరడంతో ఆయనకు పార్టీనేతలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

ఇక వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ముగ్గురు కో ఆర్డినేటర్లను మార్చి చివరకు పితాని అన్నవరం ఇక్కడ అభ్యర్ధిగా ప్రచారం చేసుకున్న తర్వాత ఆయనను కాదని మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఎంపిక చేయడంతో క్యాడర్‌లో కొంతమేర గందరగోళం నెలకొంది. ప్రస్తుతం బోస్‌ ఇక్కడ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్తున్నారు. వైసీపీ కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్లలీలాకృష్ణ, పితాని అన్నవరం పార్టీలో పనిచేసి చేతి చమురు వదుల్చుకున్నారు.

ఎవరిధీమాలో వారు ఉంటే ఓటర్ల నాడి ఎలా ఉందో ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.

మామాట: మండపేట ఈసారి దక్కేదెవరికో

Leave a Reply