బ‌స్సులో నీలి చిత్రాలు చూపించాడు…ఆపుకోలేని ఆమె ఏం చేసిందో తెలుసా..?

Share Icons:
కోల్‌క‌తా: 21డిసెంబర్,

ఈవ్ టీజ‌ర్ల వేధిస్తున్న‌ప్పుడు సాధార‌ణంగా ఏ మ‌హిళ అయినా భ‌య‌ప‌డుతుంది. కానీ ఆ యువ‌తి మాత్రం అలా కాదు.

త‌న‌ను ఈవ్ టీజింగ్ చేసిన వ్య‌క్తికి, త‌న‌కు అస‌భ్య ఫొటోలు చూపించిన అత‌నికి గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. ఈ ఘ‌ట‌న జ‌రిగింది కోల్‌క‌తాలో..!

తాజాగా ఈవ్ టీజర్ ఓ అమ్మాయి వెంటపడ్డాడు.. బస్సులో ఉన్న ఆ యువతికి తన ఫోన్‌లో నుండి పలు అభ్యంతకరమైన ఫోటోలను చూపిస్తూ ఉన్నాడు.

పోర్న్ వీడియోలను కూడా చూపిస్తూ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు.

కలకత్తాకు చెందిన యువతి అనన్య ఛటర్జీకి ఈ ఘటన ఎదురైంది. అలాగని ఈమె ఎక్కడా తగ్గలేదు.

బస్సులో ఉన్న అనన్యతో అతడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఉన్న కిటీలో కనిపించే విధంగా అభ్యంతకర ఫోటోలను చూపించడం మొదలుపెట్టాడు.

అలాగే అతడి మోచేతితో ఆమెను తాకి అసభ్యంగా సిగ్నల్స్ ఇచ్చాడు. ఓ ద‌శ‌లో ఆమె పక్క‌న సీటు ఖాళీ అవ‌గా అత‌ను వెనుక సీట్లోంచి లేచి ఆమె ప‌క్క‌న వ‌చ్చి కూర్చున్నాడు. దీంతో అత‌ను మ‌రింత రెచ్చిపోయాడు.

చాలా సేపు అలా బూతు బొమ్మ‌ల‌ను చూపిస్తూనే ఉన్నాడు. దీనికి తోడు అన‌న్య వైపు చూస్తూ అస‌భ్య‌కర రీతిలో సైగ‌లు చేశాడు. అయితే..

అన‌న్య ఇక ఓపిక ప‌ట్ట‌లేక‌పోయింది. వెంట‌నే ఆ వ్య‌క్తి జుట్టు ప‌ట్టుకుని పైకి లేపి సెంటర్ మీద ఒక తన్ను తంది…ఇక జులాయికి  కళ్ళు బైర్లు కమ్మాయి.

అలాగే అందరి ముందూ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వగానే.. క్షమించు అని ఆ యువకుడు ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అక్కడితో ఆ యువతి ఆగలేదు. అతని కాలర్ పట్టుకొని..

అతడి ఫోన్ లాక్కొని..స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్ళింది. ఆ యువకుడి భార్య వచ్చి అతణ్ణి వదిలేయమని ప్రాధేయపడిందట..! తనకు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టింది అనన్య.

అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదని ఈ సంఘటనతో ఆమె నిరూపించింది.

ధైర్యంగా ముందుకువెళితే ఎలాంటి వాడినైనా అడ్డుకోవచ్చని ఆమె చెప్పింది.

మామాట: ఏది ఏమైనా అన‌న్య చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇలా అంద‌రూ చేస్తే అప్పుడు ఏ వెధ‌వ ఈవ్ టీజింగ్ చేయ‌డానికి కూడా సాహసించ‌డు క‌దా..!

Leave a Reply