యాత్ర లో మమ్ముట్టి స్టైల్ అదిరింది

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 07,

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి మొదటి నుంచి బలమైన కథాకథనాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ఆయన ఖాతాలో చెప్పుకోదగిన సినిమాలు చాలానే కనిపిస్తాయి. తనకి నచ్చిన పాత్రలు వస్తే ఇతర భాషల్లో చేయడానికి కూడా ఆయన ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అలా ప్రస్తుతం ఆయన ‘యాత్ర’ సినిమా చేస్తున్నారు.

దివంగత  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతకాలం క్రితం ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజున మమ్ముట్టి పుట్టినరోజు కావడంతో, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తూ మమ్ముట్టి ఆకట్టుకుంటున్నాడు. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మామాట:  మహానేతను మరపిస్తున్నావు సూపర్ స్టార్

Leave a Reply