బీజేపీకి చెక్ పెట్టేందుకు మమత కొత్త వ్యూహం…!

mamata-banerjee- started hindi department in TMC party
Share Icons:

కోల్‌కతా, 8 సెప్టెంబర్:

ఎప్పుడూ బీజేపీ అంటే ఒంటి కాలి మీద లేచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహ రచన చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  హిందీ మాట్లాడే ప్రజలను ఆకట్టుకునేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగానికి సంబంధించిన అన్నీ బాధ్యతలను ఎమ్మెల్యే అర్జున్ సింగ్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా హిందీ భాషా ప్రియులని ఉద్దేశిస్తూ ‘‘దేశంలోని హిందీ మాట్లాడే ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నన్ను మీ కుమార్తెగా భావించాలని కోరుతున్నాను..’’ అంటూ వ్యాఖ్యానించారు.

టి‌ఎం‌సిలో హిందీ విభాగాన్ని ప్రారంభించామని చెప్పిన ఆమె రాష్ట్రంలో ఓ హిందీ యూనివర్సిటీని ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలిపారు.

ఇంతకీ ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న కారణమెంటంటే పశ్చిమ బెంగాల్‌లో ఉన్న బెంగాలీ యేతర వారే. వారి ఓటరు జాబితా 20శాతం ఉండగా గెలుపోటములు నిర్ణయించే క్రమంలో వారిది కూడా కీలక పాత్రే ఉంటుందని మమతా అంచనా.

వారి ఓట్లను గుంజుకునేందుకు బీజేపీ బెంగాలీ యేతర ప్రాంతాలపై కన్నేసినట్టు మమతా గుర్తించి ఆ పార్టీకి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మామాట: మరి మమత వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో… ?

Leave a Reply