దుర్గా పూజకు పాటలు రాస్తున్న మమత

Share Icons:

కొలకత్తా, సెప్టెంబర్ 11,

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ గానే అందరికీ తెలుసు కానీ నిత్యం రాజకీయ ఎత్తులు –జిత్తులతో బిజీ గా ఉండే మమత తన మనసులోని భావాలను కవితల రూపంలో ఆవిష్కరిస్తుంటారు. తాజాగా, ఈ ఏడు నిర్వహించనున్న దుర్గా పూజల థీమ్ సాంగ్  మమత కలం నుంచి జాలువారింది. దుర్గాపూజా కమిటీతో సమావేశమైన ముఖ్య మంత్రి మమతాబెనర్జీ, గతంలో ఉన్న సంప్రదాయం మేరకు దుర్గాదేవిని ఆవాహన చేసే విధంగా ఈ థీమ్ సాంగ్ ఉంటుందని తెలిపారు, కాగా మంత్రివర్గ సహచరుడు అరూప్ బిస్వాస్ కోరిక మేరకు అగొమెనీ సంప్రదాయం లో పాట రచించినట్టు మమత తెలిపారు. ఈ పాట జై దేవీ సర్వభూతేషు అంటు ప్రారంభమౌతుందని తెలిసింది. ఈ పాటకు సంబంధించిన మరో విశేషమేమిటంటే, మమత కేబినెట్ లో  సాంస్కృతిక శాఖా మంత్రి , ప్రముఖ గాయని ఇంద్రాణి సేన్ ఈ పాటను గానం చేశారు. గత సంవత్సరం కూడా దుర్గాపూజ సమయంలో  ప్రత్యేక గీతాన్ని మమతా బెనర్జీ రచించిన విషయం తెలిసిందే.

మామాట: మమతలో ఈ కోణంకూడా ఉందా..

Leave a Reply