కలిసి ఉంటే ఒకే..లేదంటే అణగదొక్కుతారా…?

Share Icons:

కోల్‌కతా, 19 జనవరి:

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేశారని, మోదీ హయాంలోనే రాఫెల్ వంటి పెద్ద కుంభకోణాలు జరిగాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.  కోల్ కతాలో బీజేపీ యేతర పక్షాల ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ…మోదీ ప్రభుత్వం గడువు ముగిసిపోయిందని అన్నారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్, మాయావతి సహా ఎవరినీ వాళ్లు వదల్లేదని, వాళ్లతో కలిసి ఉంటే ఫర్వాలేదు కానీ, లేకపోతే అందరినీ అణగదొక్కుతారని విమర్శించారు.

ఇక ఇదే సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… దేశంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో కుప్పకూలనుందని, ఈ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజలు కొత్త ప్రధానిని ఎన్నకోనున్నారన్నారు. బిజెపి అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోదీలను ప్రజలు వద్దనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

అలాగే ఐదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఈ దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడిని యావత్తు దేశం చూస్తోందని అన్నారు.

మామాట: మొత్తానికి విపక్షాలన్నీ మోదీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారుగా…

Leave a Reply