మల్కాజిగిరిలో ఏ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ…

Share Icons:

హైదరాబాద్, 21 మార్చి:

దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరి. ఈ నియోజకవర్గంలో 90శాతం పట్టణ జనాభా ఉంటుంది. గత ఎన్నికల్లో కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ డీజీపీ దిలీప్‌రెడ్డి, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌నారాయణ్‌, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, మైనంపల్లి హన్మంత్‌రావు లాంటి ప్రముఖులు పోటీ చేశారు. అయితే సీఎంఆర్‌ విద్యా సంస్థలకు చెందిన మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఇక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా…కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. రేవంత్‌కి పోటీగా టీఆర్ఎస్ నుండి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ బరిలో ఉండనున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఉన్నారు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సులువు అయ్యేది. కానీ రేవంత్ కాంగ్రెస్ బరిలో ఉండటం…ఆ పార్టీకి గెలుపు కష్టం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కసి మీదున్న రేవంత్… ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎక్కువ ఆవేశ పడకుండా సైలెంట్‌గా ప్రచారం చేస్తూ జనాలని ఆకర్షిస్తున్నారు.

గతంలో పోటీచేసిన లోక్‌స‌త్తా, వైసీపీలు ఈ ద‌ఫా పోటీలో లేవు. కాబ‌ట్టి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప‌డే అవ‌కాశం ఉంది. ఇక్కడ ఉన్న టీడీపీ మద్ధతుదారులు కూడా రేవంత్‌కే సపోర్ట్ చేస్తారు. దీంతో రేవంత్ విజయం ఈజీ కానుంది.

దాదాపు 30 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో బీసీ కులాలకు సంబంధించిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే రెడ్డి, యాదవులు, గౌడ సామాజికవర్గం వారు కీలకంగా వ్యవహరించనున్నారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ కంటోన్నెంట్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి,ఉప్పల్‌ నియోజకవర్గాల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వారు ఎక్కువ. అందులో ఆంధ్రా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీరిలో అన్నీ పార్టీల వారు ఉన్న…రేవంత్‌ మీద అభిమానం ఉన్నవారు కూడా బాగానే ఉన్నారు. అలాగే సిక్కులు, క్రిష్టియన్లు, ముస్లిం మతస్తులు ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు కూడా కీలకమైంది. మరి మెజారిటీ ఓటర్లు ఎవరువైపు మొగ్గు చూపుతారో.

మామాట: మరి వీరు ఎవరి వైపు ఉంటారో

Leave a Reply