మల్కాజిగిరి ప్రజలు రేవంత్ వైపు ఉంటారా..?

Share Icons:

హైదరాబాద్, 1 ఏప్రిల్:

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తను ఎంతగానో నమ్ముకున్న కొడంగల్ ప్రజలు రేవంత్‌ని ఓడించారు. మరి బలంగా ఉన్నచోటే ఓడినా…రేవంత్ వెనుక మల్కాజిగిరి ప్రజలు ఎంతవరకు ఉంటారు అనే ప్రశ్నఉత్పన్నం అవుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్తితి ఇప్పుడు లేనట్లుగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య మూలాలను దెబ్బకొట్టింది. ప్రతిపక్షమే ఉండొద్దు…అనే విధంగా ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలని లాగేసుకుంది. దీనిపై ప్రజల్లో కనపడని వ్యతిరేకత ఉందని అర్ధమవుతుంది.

ముఖ్యంగా అన్నీ వర్గాలు, అన్నీ రాష్ట్రాలకి సమబంధించిన జనం ఎక్కువ ఉన్న మల్కాజిగిరిలో టీఆర్ఎస్‌పై కోపంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచిన..ఓడినా వ్యాపారమే చేసుకుంటారు. దీంతో తమ గురించి పార్లమెంట్‌లో పోరాడే నేత ఉండడు. అందుకే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న రేవంత్‌ని గెలిపించుకుంటేనే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకగా ఉన్న వారంతా విజయం సాధించారు. వీరి గెలుపు కాంగ్రెస్‌ శ్రేణులకే కాదు… ప్రజాస్వామికవాదులకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. ఈ ఫలితాలు మేం ఊహించినవే. కొందరు పాలకులు మేం దేవుళ్లమని అనుకుంటారు. అలాంటి సమయాల్లో ఇలానే జరుగుతుంది. పైగా  హైదరాబాద్‌లో మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల మీటింగ్‌ పెడితే టీఆర్‌ఎస్‌కు జనం రాలేదు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఇబ్బందికర పరిస్తితి వచ్చేలా ఉంది. మొత్తం మీద మల్కాజిగిరి ప్రజలు రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

మామాట: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుక ఉండాలి…

Leave a Reply