ఉరిశిక్షను రద్దుచేయనున్న మలేషియా

Share Icons:

మలేషియా, అక్టోబర్ 11,

దేశీయంగా వస్తున్న తీవ్ర నిరసనల నేపథ్యంలో మరణశిక్షను రద్దుచేయాలని మలేషియా ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ మంత్రి ఒకరు గురువారం ప్రకటించారు.

ప్రస్తుతం మలేషియా చట్టాల ప్రకారం హత్య, కిడ్నాప్, తుపాకులు కలిగి ఉండడం, మత్తుమందుల రవాణా తదితర నేరాలకు ఉరి వంటి మరణశిక్షలు విధిస్తున్నారు. ఇందులో సాధారణంగా అప్పటి బ్రిటిష్ పాలకుల పద్దతిలో నేరస్తులను ఉరితీస్తున్నారు. అయితే మరణశిక్షను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది, వీలయినంత త్వరలో ఈ మేరకు చట్టసవరణ జరుగు తుందని సమాచార,మల్టీమీడియాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దేవ్ తెలిపారు.

మరణశిక్షపై మలేషియా వాసులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజా నిర్ణయాన్ని మానవ హక్కుల న్యాయవాదులు స్వాగతించారు. మరణశిక్ష అనాగరికమైనది, ఊహించలేనంత దారుణమైనదని హక్కుల న్యాయవాదుల సలహా మండలి సభ్యుడు ఎన్. సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. ఒకసారి చట్టసవరణ జరిగితే… ఇతర దేశాలలో మరశిక్ష ఎదుర్కొంటున్న మలేషియా జాతీయుల హక్కులపై పోరాడే నైతిక బలం తమకు సమకూరుతుందన్నారు.

 

మామాట: నిజమే మరణశిక్ష ఊహించలేనంత దారుణమైనదే.

 

Leave a Reply