ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు భార్య పాత్రలో మలయాళ హీరోయిన్….?

Bahubali cg technolgy is used to NTR biopic
Share Icons:

హైదరాబాద్, 14 ఆగష్టు:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాత్రల కోసం వివిధ భాషలకు చెందిన తారలను ఎంపిక చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తుండగా, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. అయితే చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్ కనిపించబోతుందని సమాచారం. దాదాపు ఆమె ఎంపిక ఖాయమైనట్లు చెబుతున్నారు.

‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమైన మంజిమా మోహన్ ప్రస్తుతం ‘క్వీన్’ మలయాళం రీమేక్‌లో నటిస్తోంది. త్వరలోనే ఆమె ‘ఎన్టీఆర్’సెట్స్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు.

Manjima Mohan as Chandrababu Naidu's wife in NTR biopic

ఇక ఈ సినిమాలో చంద్రబాబు దంపతులతో పాటు ఏఎన్నార్, శ్రీదేవి, సావిత్రి, ఎస్వీఆర్,తదితర పాత్రలు కన్పించనున్నాయి. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మామాట: ఇంకా ఎన్ని పాత్రలు వస్తాయో చూడాలి…

Leave a Reply