బాబుకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ముఖ్య నేతలు…

chandrababu comments on ap govt
Share Icons:

అమరావతి:

ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీని ప్రధాన నేతలంతా వీడుతూ బీజేపీ-వైసీపీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ముఖ్య నేతలు చంద్రబాబుకు వరుస షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. గత కొంత కాలంగా వీరు పార్టీని వీడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధినేత చంద్రబాబు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వీడే నేతల్లో విశాఖపట్నంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణలు ఉన్నట్లు సమాచారం.

టీడీపీని వీడాలని ఇద్దరు మాజీ మంత్రులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే వీరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గంటాతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనతో పాటుగా నారాయణను సైతం బీజేపీలోకి తీసుకెళ్లాలనేది గంటా ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న గంటా పార్టీ మారితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీనికి సైతం గంటా సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తోట త్రిమూర్తులు హాజరు కాలేదు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినా ఆయన సమావేశానికి రాలేదు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులు సైతం పార్టీ సమీక్షకు దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పటికే త్రిమూర్తులతో మంతనాలు జరిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ తోనూ తోట త్రిమూర్తులు సంప్రదింపులు చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్తారని సమాచారం. ఈ వారంలోనే ఆయన అధికారికంగా వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో

ప్రకాశం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం టీడీపీ వీడేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, వారు వైసీపీలోకి వెళ్తే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలోనే వారు ఆలోచనలో ఉన్నారని.. దీని పైన ప్రత్యామ్నాయంగా అధికార పార్టీ నుండి హామీ వస్తే వారు టీడీపీ వీడటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక కడపలో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. అలాగే మరో సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వీరు బాబు వరుస షాకులు ఇవ్వడం అయితే ఖాయం.

Leave a Reply