మణికర్ణిక వివాదం…క్రిష్ వర్సెస్ కంగనా…

Share Icons:

హైదరాబాద్, 2 ఫిబ్రవరి:

గత కొన్నిరోజులుగా మణికర్ణిక సినిమా విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  ఒక డైరెక్టర్ గా తనకు ఇవ్వాల్సిన కనీస విలువ కూడా ఇవ్వలేదని దర్శకుడు క్రిష్‌ మీడియాకు వెల్లడించి బాధపడ్డారు. అలాగే సినిమా 70 శాతం డైరెక్షన్‌ క్రెడిట్‌ను కంగనా తీసుకోవడంపై  క్రిష్‌ ఖండించారు. ఇక సినిమా ఎడిటింగ్‌ సమయంలో కంగనా చాలా మూర్ఖంగా ప్రవర్తించారని, సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ తనకు చెప్పలేదని, తనని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు .

మరో వైపు సోను సూద్ తన పాత్రను కట్ చేసారంటూ ఆరోపించారు. ఇక ఈ వివాదంపై కంగనా సోదరి రంగోలి కూడా రియాక్ట్ అవుతూ.. క్రిష్‌కి కంగన చాలా సార్లు ఫోన్‌ చేసిందని కానీ అతను స్పందించలేదని అన్నారు. క్రిష్‌ సినిమా మొత్తాన్ని తానే తెరకెక్కించినట్లైతే అది నిజమని నిరూపించాలని డిమాండ్‌ చేసారు.

ఇక తాజాగా ఈ వివాదంపై స్విట్జర్లాండ్ ట్రిప్‌ నుంచి వచ్చిన కంగనా స్పందించారు. మణికర్ణిక సినిమాకు తానే దర్శకత్వం వహించా అని క్లారిటీ ఇచ్చింది. క్రిష్‌ ఇలా తనని ఎటాక్‌ చేయడం సరికాదని, ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండని  సవాల్ విసిరారు. అసలు మీడియాతో మాట్లాడితే ఆయనకు ఒరిగేది ఏమీ లేదని, సినిమా రిలీజ్ అయ్యిందని, ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించానని, ఈ విషయంలో ఇక చేయడానికి ఏం లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అలాగే సోనూసూద్ వ్యాఖ్యలపై కూడా కంగనా స్పందించింది, ‘నా పాత్రను తీసేశారు, కట్‌ చేశారు’ అని ఆరోపణలు చేసిన వారికి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా. తాను ఓ నటిగా, ఫిల్మ్‌మేకర్‌గా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నానని, వీటిని తాను  స్వతహాగా సాధించానని చెప్పుకొచ్చింది. ఇక మీరూ ఇలాంటి స్థాయికి రండి. అంతేకానీ మరొకర్ని చూసి ఏడిస్తే లాభం లేదు, అలా ఏడుస్తున్న వారందరిని పెట్టి క్రిష్ ను మళ్లీ సినిమా తీసుకొమ్మనని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

మామాట: కంగనాది కాన్ఫిడెన్స్‌నా…ఓవర్ కాన్ఫిడెన్స్‌నా…

Leave a Reply